నేటి సాక్షి, నల్లబెల్లి జనవరి 12 : యువత క్రీడల్లో రాణించాలి. క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం దేహదారుఢ్యం తో పాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని మండలంలోని రంగాపురం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పొన్నం యాకుబ్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సోమవారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని యువజ్యోతి యూత్ క్లబ్ గౌరవాధ్యక్షుడు దామ సాంబయ్య అధ్యక్షతన నిర్వహిస్తున్న క్రీడలను ముఖ్యఅతిథిగా పాల్గొన్న యాకూబ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత చదువులు చదివి లక్ష్యసాధన వైపు అడుగులు వేస్తూ క్రీడలలో రాణించాలని యువతకు ఆయన సూచించారు. క్రీడలతో ఆరోగ్యంతో పాటు వ్యాయామము లభించి మంచి ఆలోచనలు రేకెత్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య,పోలీసులు జితేందర్,ఓదెలు,పీఈటీలు, జి రవీందర్,జి బిక్షపతి. యు,శేఖర్, శ్రీకాంత్, విజేందర్, మహేష్, తోపాటు వివిధ గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

