నేటి సాక్షి : తేది. రాయికల్ మండలం ఇటిక్యాల్ గ్రామంలో ఉద్యాన, వ్యవసాయ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీ ఆధ్వర్యలో సోమవారం ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు గడ్డం సంజీవరెడ్డి క్షేత్రంలో 3 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్బంగా జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలనుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగునని తెలిపారు. మొక్కలను 90% సబ్సిడీ పై 20 రూ./- లకే ఇస్తున్నామని, డ్రిప్ పై 80%-100% సబ్సిడీ అందిస్తున్నామని, ప్రతి ఎకరానికి 4200/- సంవత్సరానికి చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 5000 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, వరి పంటతో పోలిస్తే అకాల వర్షాలు, వడగళ్ళ వానలవల్ల నష్టం ఉండదని, కోతుల బెడద ఉండదని తెలిపారు.1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం గెలలను ప్రభుత్వం నిర్దారించిన రేట్ కు కంపెనీ కొనుగోలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఉద్యాన అధికారి కె. స్వాతి,వ్యవసాయ అధికారి ముక్తీశ్వర్, వ్యసాయ విస్తరణ అధికారి కె. మత్తయ్య,ఉద్యాన విస్తరణ అధికారి రాజేష్, లోహియా కంపెనీ ప్రతినిధులు విజయ్ భరత్, రాజేష్, సిగ్నెట్ డ్రిప్ కంపెనీ సిబ్బంది గణేష్ మరియు రైతులు పాల్గొన్నారు.

