నేటి సాక్షి 12 జనవరి పాములపాడు :—భారతదేశ పేద ప్రజల పోరాటాల సింహ స్వప్నం, శ్రమజీవులకు అండగా ఉన్న సీపీఐ వందేళ్ళ శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లక్షలాది మందితో జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగ నాయుడు, బాబా ఫకృదన్,కార్యవర్గ సభ్యులు ఏం. రమేష్ బాబు లు పిలుపునిచ్చారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో శతాబ్ది ఉత్సవాల జయప్రదం కోరుతూ జిపు జాత మండలనికి చేరుకుంది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 18వ తేదీన ఖమ్మం నగరంలో సిపిఐ శత వసంతాల వేడుకలను ఘనంగా జరగనున్నాయని స్వాతంత్రం సాధించిన తర్వాత ఎన్నో త్యాగాలతో నిర్బంధాలతో ఎన్నో పోరాటాలు ఎన్నెన్నో త్యాగాలు చేసింన సీపీఐ భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం సామజిక న్యాయం కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో అంతర్భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ 1932లోనే ప్రారంభమయ్యిందని నందికొట్కూరు నియోజకవర్గం ప్రాంతంలో అనేక పోరాటాలకు నాంది పలికి పేదలకు మౌలిక సదుపాయాలు కావాలని భూ పంపిణీ చేయాలని పోరాటాలు కొనసాగించిందన్నారు.ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నది. ఈ దేశంలో నేటి ప్రమాదకర పరిస్థితులలో శ్రామికవర్గ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ఏ రూపంలో ఉన్నా కమ్యూనిస్టులందరూ ఏకం కావలసిన అవసరం ఉన్నది. ఈ లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ ముందుకు సాగుతున్నదని ముందుతరాల త్యాగాలతో పునీతమైన ఎర్ర జెండా రెండవ శతాబ్దంలోకి అడుగుపెడుతూ సోషలిజం అంతిమ లక్ష్యంగా, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కోసం ముందుకు సాగుతున్నదిఅని ఆ ఎర్ర జెండాను ఆదరించమని, దాని ద్వారా శ్రమజీవుల హక్కుల రక్షణకు హామీ లభించగలదని మరోసారి ప్రకటిస్తున్నదిఅని రైతులు సకల రంగాల శ్రమజీవుల కోసం జరుగు జనవరి 18న ఖమ్మం పట్టణంలో జరిగే శతాబ్ది ఉత్సవాల ముగింపు ప్రదర్శన, బహిరంగ సభలలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరారుఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, భార్గవ్, సుబ్బారెడ్డి, సోమన్న, తదితరులు పాల్గొన్నారు..

