Sunday, January 18, 2026

పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ …..

నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 13, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), పిఆర్టియుటిఎస్ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ ఐఏఎస్ కార్యాలయంలో మంగళవారం నాడు కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పి ఆర్ టి యు టి ఎస్ 2026 డైరీ, క్యాలెండర్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ఆర్ టి యు టి ఎస్ కార్యవర్గంతో మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో పదవ తరగతి పాఠ్యాంశాలు పూర్తి అయినవ మరియు విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారని కులం కుశంగా చర్చించారు. అదేవిధంగా గత విద్యా సంవత్సరం 95% పైగా ఫలితాలు సాధించామని ఈ సంవత్సరము 100% సాధించేలా కృషి చేయాలని సంఘ పక్షాన మీరు కూడా ప్రయత్నం చేయాలని సూచించారు ఈ సందర్భంగా పిఆర్టియు టిఎస్ జిల్లా అధ్యక్షులు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఆరో ఓ,ఏ ఆర్ ఓ విధుల నుండి ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులను మినయించాలని ఇదివరకే కోరడం జరిగిందని గుర్తు చేశారు.జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తూ తప్పకుండా చేద్దామన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు మంచిగా జరిగేలా చూడాలని అన్నారు.అదేవిధంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో పాల్గొన్న టిఓటిలకు రెమ్యూనరేషన్ ఇప్పటికి చెల్లించలేదు అని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురాగా వెంటనే ఫైల్ పెట్టాలని డిపిఓ గారికి సిబ్బంది ద్వారా తెలియజేశారు. అందుకు జిల్లా శాఖ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట మండల అధ్యక్షులు ఎం రఘువీర్ జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ప్రకాష్,శ్రీనివాస్, ఇశ్రాత్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News