నేటిసాక్షి, కరీంనగర్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సమష్టిగా కృషిచేసి విజయఢంకా మోగిస్తామని కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. కరీంనగర్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నిరంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు కోడూరు సత్యనారాయణ గౌడ్, ఆరేపల్లి మోహన్, పాల్గొన్నారు

