నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండలం రాపెళ్లి గ్రామంలో ఆర్గనైజింగ్ కేఫా సంతోష్ ఆధ్వర్యంలో గొల్లపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా అట్టహాసంగా ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్న గొల్లపల్లి సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ గురిజల బుచ్చిరెడ్డిఈ సందర్భంగా సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి మాట్లాడుతూ యువత కృషి పట్టుదలతో కష్టపడి క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుందని, క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి ఆరోగ్యకరమైన జీవితానికి, విజయవంతమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయని క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి వంటివి సాధించవచ్చని ఇవి జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడతాయని అంతేకాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనలని యువతకు తన పూర్తిసహకరం ఎల్లప్పుడూ ఉంటుందని అదేవిధంగా ఈ టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

