నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: రాబోయే ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు గారు మంగళవారం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్–1లో పర్యటించారు.ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి సమస్యలను నేరుగా పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ప్రజలకు నిజమైన సంక్షేమం అందుతుందని, బీజేపీ, బీఆర్ఎస్ పాలనల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు.ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆత్రం సుగుణ గారు, పట్టణ అధ్యక్షులు రఫీక్ అహ్మద్ గారు, పలువురు జిల్లా, పట్టణ, వార్డు స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

