నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )Arrive Alive రోడ్డు భద్రత కార్యక్రమం లో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల డిఎస్పి రఘు చందర్ సూచనలతో ధర్మపురి సీఐ రామ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలం చిలువకోడూరు గ్రామంలో మంగళవారం రోజున నుండి 10 రోజుల పాటు నిర్వహించనున్న Arrive Alive రోడ్డు భద్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పిస్తూ తగిన సూచనలు తెలియజేశారు. రోడ్డుపైన ప్రయాణించే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాల్సిన సూచిస్తూ, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పట్ల అవగాహన ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో చిలువకోడూర్ గోవిందపల్లి దట్నూర్ చందోలి గ్రామల సర్పంచులు చిలువకోడూర్ గ్రామ ప్రజలు సుమారు 60 మంది మరియు గొల్లపల్లి పోలీస్ సిబ్బంది హాజరైనారు.

