Sunday, January 18, 2026

*సచివాలయం సిబ్బందికి సంక్రాంతి కానుక అందజేసిన టిడిపి నాయకులు వార్తాలా శివాయాదవ్*

నేటి సాక్షి తిరుపతి *తిరుపతి రూరల్* తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ వార్తాల శివ యాదవ్ తన సొంత నిధులతో సంక్రాంతి కానుకులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ చిరు ఉద్యోగులు కూడా ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఈ చిన్న కానుకలను తన సొంత నిధులతో అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్ర అభివృద్ధికి, చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పులివర్తి నాని నిరంతర కృషి చేస్తున్నారని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కృష్ణయ్య, నాగరాజు యాదవ్, మునస్వామి యాదవ్, చెంచు రామ యాదవ్, ఖలీల్, సైసా, గురునాథం ఆచారి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News