నేటి సాక్షి,కొమరం భీమ్ ఆసిఫాబాద్:గోలేటి: అజ్మీర ఆత్మారాం నాయక్ యువసైన్యం ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అజ్మీర ఆత్మారాం నాయక్ గారి జనవరి 15వ తేదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గత కొన్ని రోజులుగా గోలేటి సింగరేణి గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు శుక్రవారం ఫైనల్ దశకు చేరుకున్నాయి.ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పలువురు జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడగా, ఫైనల్ మ్యాచ్‌లో పులిమడుగు జట్టు విజయం సాధించగా, భీమారం జట్టు రన్నరప్‌గా నిలిచింది.విజేతలకు ప్రైజ్‌మనీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు అజ్మీర ఆత్మారాం నాయక్ గారు, గోలేటి కైరిగూడ సర్పంచ్ అజ్మీర సంధ్యారాణి గారు, ఉపసర్పంచ్ సునీత శంకర్ గారు అందజేశారు.మొదటి బహుమతిగా రూ. 21,000, రెండో బహుమతిగా రూ. 11,000 ప్రదానం చేశారు.ఈ కార్యక్రమ నిర్వాహకులు అజ్మీర సాయి, అజ్మీర సందీప్, ప్రదీప్, సిహెచ్ సంతోష్, జరుపుల శివాజీ, అంబాదాస్, తరుణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

