నేటి సాక్షి, బుగ్గారం బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామంలో బుధవారం నాడు గంగాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ గ్రామ సర్పంచ్ రాయిల్ల శ్రీనివాస్ టాస్ వేసి ఆట ప్రారంభం చేశారు .గెలిచిన విజేతలకు మొదటి బహుమతిగా 5016, రెండో విజేతకు 3016, మూడో విజేతకు 2016. ఈ సందర్భంగా సర్పంచ్ రాయిల్ల శ్రీనివాస్ సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులు యువత క్రీడల్లో అభివృద్ధి పెంచుకోవాలని ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుర్రపు తిరుపతి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

