నేటి సాక్షి, కరీంనగర్: గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గునుకులకొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్‌వర్మ బుధవారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. మినరల్ వాటర్‌ప్లాంటు, రజక కమ్యూనిటీ భవనం, ఆరె క్షత్రియ భవనానికి ప్రహరీ, ముదిరాజ్ కమ్యూనిటీ హాలు తదితర పనులకు నిధులు కేటాయించాలని కోరారు. నాయకులు మద్దురు మహేందర్, బట్టు సంపత్, బూట్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.

