Saturday, January 17, 2026

సంక్రాంతి పండుగ సందర్భంగా లింగాల గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం విజయవంతం… సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి .

నేటి సాక్షి 14 జనవరి పాములపాడు :-పాములపాడు మండలంలోని లింగాల గ్రామంలో సంక్రాంతి పండుగ చాల గొప్పగా ఘనముగా జరిపారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా లింగాల గ్రామంలో యూత్ ఆర్గనైజర్స్ యం.అశోక్ యం.శంకర్ అందరూ కలిసి అక్షయ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా లింగాల సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి మరియు దేశపోరటం తెలుగు దినపత్రిక సంస్థ యజమాని తుపాకుల రమేష్ హాజరు అయ్యారు. ఎస్ఐ పీ. తిరుపాలు పాల్గొన్నారు. లింగాల యూత్ నవీన్ గౌడ్ బ్లేడ్ డొనేషన్ చేయడం జరిగినది.వారు మాట్లాడుతూ ఈరోజు రక్త దాన శిబిరం కార్యక్రమం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్రాంతి ప్రాముఖ్యత ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కొత్త పండుగ రైతులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే పండుగనే సంక్రాంతి. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ రక్త దాన శిబిరం కోసం ప్రతి ఒక్కరూ ఆపద సమయంలో గర్భిణి స్త్రీలు కి కావచ్చు ఆపరేషన్ కు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు ఎవరికైనా సరే అత్యవసరంగా ఉపయోగపడేది ఒక రక్తం. కాబట్టి మన వంతు సహాయం చేయాలి అనే ఆలోచనతో తరుపున మా లింగాల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు అందరూ బాగుండాలని అక్షయ బ్లేడ్ బ్యాంక్ వారి తరుపున యూత్ అందరూ బ్లేడ్ డొనేషన్ చేయడం జరిగింది.లింగాల సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ రక్త దాన శిబిరం చేయడం చాలా సంతోషమైన విషయం ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే మా లింగాల గ్రామంలో కూడా బ్లేడ్ డొనేషన్ చేయడం లో మా ఊరి యూత్ ని అభినందిస్తున్నాను అని తెలిపారు ఇలాంటి మంచి మంచి సేవలు చేయడం లో లింగాల గ్రామం ముందు ఉంటుంది అని సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి తెలిపారు. భారతదేశ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి పండుగ రేగి పండ్లను పిల్లలపై పోస్తూ భోగిపండ్ల పండుగ,చేసుకుంటూ భోగభాగ్యాలతో,తులతూగాలనిసంక్రాంతి ఉత్సవాలలో గంగిరెద్దుల కోలాహలంతో, రంగవల్లుల హరివిల్లులతో, పాల పొంగళ్లతో, హరిదాసుల కీర్తనలతో సరదాగా సంక్రాంతి జరుపుకుంటూన్నాం అన్నారు.కనుమ పండుగతో ఏడాది పొడవునా మన కష్టంలో పాలుపంచుకునే పశు సంపదను పూజిస్తూ కమ్మని అనుభూతితో కనుమ పండగ జరుపుకోవాలని అన్నారు.మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. భోగి మంటల భోగ భాగ్యాలు ఈ విధంగా ఉంటాయన్నారు. రంగు రంగుల రంగవల్లులు, కనుల విందుగా గొబ్బెమ్మలు, హరిదాసుల భజన కీర్తనలు, కర కరలాడే చకినాల్ గారెలు, ఘుమ ఘుమలాడే పొగలు గక్కె పొంగళ్లు, పట్టు చీరెలు, పావడాలు, పరికిణీలు, పీ పీ మంటూ సన్నాయిలు, గంగిరెద్దులు గంట సవాళ్లు, డూ డూ డూ డూ బసవన్నలు, ఆకాశంలో రెప రెపలాడే పతంగులు, తియ్యగ తిని తియ్యగా మాట్లాడాలని అన్నారు. నువ్వులు శక్కరి దిని నూరేళ్లు బతుకు అంటూ మన పెద్ద మనుషుల చల్లని దీవెనెలు పిల్లల నోము, కొత్త కోడలు నోము అందరికీ ఉంటాయన్నారు. ఈ పండుగకు క్రికెట్ టోర్నమెంట్లు, కబడ్డీ, ఇతర ఆటల పోటీలు,కోడి పందేలు , పొట్టేళ్ల పోటీలు, ఎద్దుల పందాలు, కొలువుదీరిన బొమ్మల కొలువులు ఉంటాయన్నారు. వృషభ రాజముల పూజల కనుమ సంతోషాల సంక్రాంతి. తెచ్చెను ముదమున కొత్త క్రాంతి విరజిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, మీకూ, మీ కుటుంబ సభ్యులకు, మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లోహోటల్ రమణమ్మ మైల అశోక్ మధన్, రమేష్, శివ పరమేష్, భార్గవి లింగస్వామి గౌడ్ బ్లేడ్ బ్యాంక్ వారు యాజమాన్యం కటారి ప్రతాప్ వారి బృందం పాల్గొన్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News