*నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* సంక్రాంతి పండుగ పల్లె శోభకు, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని డా.బి.ఆర్.అంబేడ్కర్ జాతీయ అవార్డు గ్రహీత, యువ న్యాయవాది జక్కనపల్లి గణేష్ అన్నారు. బుధవారం మైలారం గ్రామంలోని ప్రాతమికొన్నత పాఠశాలలో చిన్నారులకు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండగలు ప్రజలకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నింపుతాయన్నారు. ముగ్గులు గృహాలకు శోభను, ఆ కుటుంబాలకు గౌరవాన్నిస్తాయి అన్నారు. పల్లె సంస్కృతి సాంప్రదాయాలు మానవ జీవితాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. సంక్రాంతి పండుగ రైతుల శ్రమ ఫలితం వారి ఇంటికి చేరి, కుటుంబాలను ఆనందంగా ఉంచే పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మైసంపల్లి తిరుపతి, జక్కనపల్లి కవిత, జక్కనపల్లి లక్ష్మి, మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ వరాల పరుశరాములు, మాజీ ఎంపీటీసీ పురంశెట్టి బాలయ్య, మాజీ సర్పంచ్ జక్కనపల్లి సత్తయ్య, యూత్ క్లబ్ సభ్యులు జక్కనపల్లి వేణు, జక్కనపల్లి సతీష్, వెధిర చంటి, జక్కనపల్లి రాకేష్, జక్కనపల్లి హరీష్, గ్రామ పెద్దలు మైసంపల్లి మల్లేశం, కుంట లక్ష్మణ్, బద్ధం శ్రీనివాస్ రెడ్డి, గంగిపల్లి శంకర్, పులి రామకృష్ణ, వరాల సతీష్, అంగన్వాడీ కార్యకర్త మైసంపల్లి సుమలత తదితరులు పాల్గొన్నారు.

