నేటి సాక్షి, కరీంనగర్: త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై వారి నుంచి పలు సలహాలు, సూచనలను స్వీకరించారు. ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌తో పాటు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

