నేటి సాక్షి తిరుపతి *రామచంద్రాపురం*సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రతి యేటా భోగి పండుగ రోజున తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో భోగి పండుగ రోజున జల్లికట్టు జరిగింది ఈ జల్లికట్టు లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో నుంచి జల్లికట్టు తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, యువత గ్రామానికి చేరుకున్నారు కోడె గిత్తల కొమ్ములకు రంగులు వేసి తమ అభిమాన నాయకుల ఫోటోల పట్టీలు కట్టి జనాల మధ్య పరిగెత్తుకుంటూ పరుగులు తీస్తున్న కోడె గిత్తలను నిలువరించే క్రమంలో యువత పట్టీలను సొంతం చేసుకోవడానికి యువకులు కుస్తీపడ్డారు జల్లికట్టు ఉత్సవాల్లో భాగంగా రైతులు ఉదయాన్నే తమ పశువులను అందంగా అలంకరించారు వివిధ దేవతామూర్తులు తమ అభిమాన నాయకులు ఫోటోలను పట్టిలు అతికించి వాటిని పశువులు కొమ్ములు కట్టారు డప్పులుమోగిస్తూ యువకుల మధ్యకు విడిచిపెట్టారు యువకులు పట్టీలు సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు ఈ క్రమంలోనే పలువురికి స్వల్ప గాయాలయ్యాయి

