నేటి సాక్షి తొగుట.. వడ్డే నర్సింలుతొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేవునూరి పోచయ్య,మజ్జు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు బహుమతులను అందించడానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై రవికాంత్ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆటలలో గెలుపోటములు సహజమని క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు.ప్రతి గ్రామంలో యువతను ప్రోత్సహించడానికి నాయకులు ముందుకు రావాలన్నారు.యువత గంజాయి వంటి ఇతర మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలను కోల్పోవద్దన్నారు.రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దీంతోపాటు యువత ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు ఆర్గనేషన్స్ నాగిళ్ల ప్రవీణ్ రెడ్డి, యాటా చందు, నందారం మహేష్, గావురోల సాయి, కనికి ప్రవీణ్ మరియు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైతి స్వామి, బుర్ర నర్సింలు, ప్రవీణ్ రెడ్డి,మరియు గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

