Saturday, January 17, 2026

*కుంట్రపాకంలో… ఘనంగా వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ*

నేటి సాక్షి తిరుపతి ,*తిరుపతి రూరల్ :*సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం పంచాయితీలో సర్పంచ్ శుభ పద్మనాభ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు కరమళ్ళ వల్లి ఆధ్వర్యంలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ టోర్నమెంట్‌లో కుంట్రపాకం పంచాయితీ సభ్యుల జట్టు విజేతగా నిలవగా, కుంట్రపాకం పంచాయితీ ఆది ఆంధ్రవాడ సభ్యుల జట్టు రన్నర్‌గా గెలుపొందింది.విజేతలకు రూ.7,777 నగదు బహుమతిని,రన్నర్‌లకు రూ.5,555 నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు.గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్‌కు సుమారు రూ.25,000 వరకు ఖర్చు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని బాబు రెడ్డి, కేశువులు రెడ్డి, లక్ష్మణ్, భరత్ కుమార్ తదితరులు తమ సహకారంతో విజయవంతం చేశారు. గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను ఉత్సాహంగా విజయవంతం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News