నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు కేరమేరి మండలం సావర్ ఖేడ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ పోతురాజు ధర్మరాజుల జాతర మహోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పోతురాజును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను సందర్శించి క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారిని ఉత్సాహపరిచారు. అలాగే గ్రామ మహిళలతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తూ జాతరకు మరింత శోభను చేకూర్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కేరమేరి మండల అధ్యక్షులు రాథోడ్ అంబాజీ, సావర్ ఖేడ సర్పంచ్ అంబారావు, కేరమేరి సర్పంచ్ ఆనందరావు, మాజీ జడ్పీటీసీ దుర్పత బాయి, మాజీ ఎంపీపీ మోతిరాం, మాజీ వైస్ ఎంపీపీ కలాం, భగవంతరావు, గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

