నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 16 అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండల పరిధిలోని సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పండగ వాతావరణం కన్నుల వింపుగా కనిపించింది. సంక్రాంతి పండుగ అంటే పచ్చని తోరణాలు, రంగు రంగుల ముగ్గులు, గోమాతల అలంకరణలతో కన్నుల పండగగా ఈ సంక్రాంతి సంబరాలు ప్రజలకు మరుపురాని అనుభూతిని కలిగించింది. ఈ సంబరాలలో కొన్ని గ్రామాలలో సాంస్కృతిక నృత్యాలు, కోలాటం,గంగిరెద్దుల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి అంటే ఇంటి అల్లుళ్ళు తో పండుగ వాతావరణం నెలకొంటుందని తెలుస్తున్నది. సంక్రాంతి పండుగ అనేది బంధుమిత్రులతో కలిసి జరుపుకునే సాంప్రదాయ పండుగ అని ఎక్కడ ఉన్న స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన సంక్రాంతి పండుగ ప్రత్యేకత. ఈ పండుగ కులమతాలకు అతీతంగా పల్లె పల్లెల్లోనా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఆనందకరమని చూడగానే తెలుస్తున్నది.

