నేటి సాక్షి తిరుపతి తిరుపతి,జనవరి 15: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి ని బాలాజీ రైల్వే డివిజన్ చేయాలన్న ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తన స్వగ్రామం నారావారిపల్లెకి బస చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో కలిశారు. తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ చేయడం ద్వారా పదివేల నుంచి 15 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి కి వివరించారు. శ్రీవారి దర్శనార్థములకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అదనపు రైళ్లు అదనపు బోగీలు ఏర్పాటు చేసుకునేందుకు, రాయలసీమ ప్రాంత రైతులు బొప్పాయి, టమోటా,మామిడి, అరటి పంట ఎగుమతి దిగుమతుల కోసం బాలాజీ రైల్వే డివిజన్ ఎంతగానో ఉపయోగపడుతుందని గిరిధర్ కుమార్ సీఎంకు తెలియజేశారు. మంగంపేట ముగ్గురాయి, గూడూరు బాక్సైట్ ఘనులు ఎగుమతులకు సైతం చేయడానికి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పడటం ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు. బాలాజీ రైల్వే డివిజన్ అంశం సంబంధించి ఇప్పటికే రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ను కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు సహకారంతో కలిసి సమస్యను వివరించినట్లు తెలియజేశారు. తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేయడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని ఆయన రైల్వే పరంగా జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కుప్పాల గిరిధర్ కుమార్ తోపాటు తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, నెహ్రూ రాజు, అనిల్ తదితరులు ఉన్నారు.

