నేటిసాక్షి – మెట్ పల్లిమెట్‌పల్లి లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గాయత్రి బ్యాంకు మెట్‌పల్లి శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదారునికి సంబంధించిన ఇన్సూరెన్స్ చెక్కును అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు…గాయత్రి బ్యాంకు మెట్‌పల్లి శాఖ ఖాతాదారు, సత్తక్కపల్లి గ్రామానికి చెందిన పాతూరి శివరామకృష్ణ గారు కొన్ని నెలల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు..గాయత్రి బ్యాంకులో ప్రతి ఖాతాదారునికి “గాయత్రి నిర్భయ సేవింగ్స్” పథకం ద్వారా రూ.1,00,000/- ప్రమాద ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.ఈ నేపథ్యంలో నామినీ అయిన ఆయన అమ్మ పాతూరి శ్రీలత గారికి గాయత్రి బ్యాంకు ఇన్సూరెన్స్ చెక్కును కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు అందజేశారు.

