నేటి సాక్షి, కొమురం భీమ్ ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ పట్టణంలో లారీ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా, ఈ ఎన్నికల్లోప్రెసిడెంట్‌గా శ్రీధర్‌ల శంకర్,జనరల్ సెక్రటరీగా నిజాం ఘన విజయం సాధించారు.ఈ సందర్భంగా లారీ యజమానులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధి, లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు, కార్యదర్శి తెలిపారు.వారి విజయం లారీ అసోసియేషన్‌లో నూతన ఉత్సాహాన్ని నింపిందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో లారీ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

