నేటి సాక్షి,కరీంనగర్: యూత్ కాంగ్రెస్ కరీంనగర్ సిటీ నూతన కార్యవర్గాన్ని నగర అధ్యక్షుడు ఉప్పరి విశాల్ ఆదివారం ప్రకటించారు. డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివిధ డివజన్లకు అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా ఎన్నికైన వారికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ నియామక పత్రాలను అందజేశారు. నాయకులు ముత్యం శంకర్, పడాల రాహుల్, పంజాల కృపాసాగర్ పాల్గొన్నారు.

