నేటి సాక్షి, కరీంనగర్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు టిక్కెట్లు కేటాయించాలని డీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజొద్దీన్ అన్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మెజార్టీ ఓట్లు ఉన్న డివిజన్లలో గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వారికి, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన టిక్కెట్లు ఇవ్వాలన్నారు. నాయకులు నేహాల్ అహ్మద్, లయీక్ ఖాద్రీ, అబ్దుల్ రహ్మాన్, అహ్మద్ అలీ పాల్గొన్నారు.

