నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిఆసిఫాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన “ఆసిఫాబాద్ క్రికెట్ కప్ – సీజన్ 2” ముగింపు వేడుకలకు గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు ముఖ్య అతిథిగా హాజరై, ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందిన విన్నర్ జట్టుకు, రన్నర్-అప్ జట్టుకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇలాంటి టోర్నమెంట్లు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని పేర్కొంటూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన క్రికెట్ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, BRS నాయకురాలు మర్సకోల సరస్వతి, నాయకులు చిలువేరు వెంకన్న, నిస్సార్ భాయ్, ఇస్లాం భాయ్, దూడల అశోక్, పొన్నాల నారాయణ, జావీద్ భాయ్, అహ్మద్ భాయ్, సల్మాన్ ఖాన్, ఎం.డి. తాజ్, సిహెచ్. రవి, సాజిద్, అన్సార్, హనుమండ్ల జగదీశ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

