నేటి సాక్షి తిరుపతి తిరుపతి రూరల్, జనవరి 19:ప్రజా కవి,సామాజిక విఙ్ఞానకారుడు, తాత్వికుడు ,సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి వేడుకను తిరుచానూరు ఫ్లై ఓవర్ సమీపాన నేతాజీ నగర్ విజయ గణపతి ఆలయం,యోగి వేమన మార్గం కూడలి వద్ద బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు, విజయ గణపతి ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలోస్తానిక నేతాజీ నగర్ ముఖ్య నాయకులు నరసింహ రెడ్డి, మెరిటస్ కాలేజీ ,ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొని యోగి వేమన చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పుష్ప రెడ్డి మాట్లాడుతూ యోగి వేమన నైతిక విలువలు,విజ్ఞానం అందించే పద్యాలు,రచనలు ద్వారా సమాజ హిత సందేశాలు అందించారని,అలాంటి మహానుభావుడు జయంతి జనవరి 19 న నిర్వహించడం,స్మరించడం జరుగుతుందని,ఆయన సేవలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కడపలో యోగి వేమన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని,అందుకే నేడు స్థానికంగా ఉన్న కాలేజీ ఉపాధ్యాయులు విద్యార్ధులతో కలిసి,నేతాజీ నగర్ కాలనీ ఏర్పాటులో,ముఖ్య పాత్ర పోషించిన నరసింహా రెడ్డి పాల్గొని ఆదర్శంగా తీసుకున్నారని ,అదే విధంగా నేటి యువత ఆయన స్పూర్తితో ,ఆశయాలను ఆచరణ లో పెట్టడమే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమం అనంతరం విజయ గణపతి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన,స్తానికులు ,కాలేజీ ఉపాధ్యాయులు విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేశారు.

