*నేటి సాక్షి-భీమారం* ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు హామీలు ఇవ్వడం వాటిని నెరవేరుస్తానని ప్రతిజ్ఞలు చేయడం సర్వసాధారణ విషయం అలాగే భీమారం మండల కేంద్రానికి కూడా సర్పంచ్ గా పోటీ చేసిన బద్దం శ్యామల రాఘవరెడ్డి గెలిచిన ఓడిన నీ వెంటే ఉంటాం అని కొన్ని అభివృద్ధి పనులకు హామీలు ఇవ్వడం కూడా జరిగింది అందులో మొదటగా భీమారం మండల కేంద్రానికి ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వారు నూతనంగా ఏర్పడిన భీమారం కు ఒక అంబులెన్స్ ను సమకూర్చడం జరిగింది కొద్ది రోజులు బాగానే ప్రజలకు మెరుగైన వైద్యం కోసం చుట్టుపక్కల జగిత్యాల కోరుట్ల కరీంనగర్కు అంబులెన్స్ ను వినియోగించుకున్నారు దురదృష్టవశాత్తు 2024 డిసెంబర్ 31న భీమారం మండల కేంద్రంలో ఒక ప్రమాదం జరగగా ఆ ప్రమాద బాధితుడిని అంబులెన్స్ లో ఎక్కించుకొని జగిత్యాల వెళ్లే మార్గంలో భీమారంలోని అది కూడా బోర్లపడడం జరిగింది . అందులో ఉన్నవారికి స్వల్ప గాయాలు కాగా మొదట ప్రమాదానికి గురైన వ్యక్తి కూడా దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది అప్పటినుండి 2025 నుండి మళ్ళీ 2025 డిసెంబర్ 31 వరకు అది మూలకుపడి ఉండి నాశనమవుతుంది దీనిని గమనించిన సర్పంచ్ అభ్యర్థి బద్ధం శ్యామల, రాఘవరెడ్డి, ఎన్నికల్లో గెలిచిన ఓటమి చెందిన నిరాశ చెందకుండా అంబులెన్స్ కు అయ్యే ప్రతి పైసా ఖర్చు నేనే స్వతహాగా భరిస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీని వెంటనే మరువకుండా దానిని బాగు చేయించడానికి కంకణం కట్టుకున్నారు ఎన్నికల సమయంలో మాత్రమే గెలవడం కోసం ఎత్తుకు పైఎత్తులు మాట్లాడడం జరుగుతుంది కానీ ఒకసారి ఎవరైనా గెలిచాక ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని నమ్మిన సిద్ధాంతం ప్రకారం తను సుమారు లక్ష రూపాయలు ఖర్చుపెట్టి అంబులెన్స్ కు మరమ్మత్తులు చేర్పించడం జరిగింది దీనిని గమనించిన పలువురు కుల సంఘాల నాయకులు గ్రామస్తులు యువకులు ఎన్నికల్లో గెలిచినవారు తాను చెప్పిన హామీలను మాట్లాడిన మాటలను మర్చిపోతుంటారు కానీ శ్యామల రాఘవరెడ్డి,చేసిన పనిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తూ అభినందించారు శ్యామల రాఘవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బరిలో నిలిచే ప్రతి ఒక్కరు కూడా తమ గెలుపు కోసం ఎన్నో హామీలు ఆర్భాటాలు చేస్తుంటారు కానీ మేము గెలిచిన ఓడిన మా వంతు ప్రయత్నంగా కన్నతల్లి లాంటి గ్రామానికి సేవ చేయాలనే సదుద్దేశంతో మాకు తోచిన సేవలను గ్రామానికి అందిస్తామని అన్నారు ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చక పోవచ్చు కానీ మాతో సాధ్యమైన ప్రతి పనిని ప్రజలకు చేస్తామని చెప్పారు బద్దం శ్యామల రాఘవరెడ్డి వీరిని పలు కుల సంఘాల నాయకులు అభిమానులు యువకులు అభినందించారు.

