నేటి సాక్షి, ధర్మారం (జనవరి 19) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలు ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న జైనపురం త్రిష జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు నారాయణపేట జిల్లాలో కోస్గి గ్రామంలో 7 నుండి 9 వరకు నవంబర్ నెలలో జరిగాయి. ఈ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి త్రిష జాతీయస్థాయి పోటీలకు ఎంపికై జాతీయ స్థాయి పోటీలు గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ లో ఈనెల 19 నుండి 23 వరకు జరిగే 69వ ఎస్ జి ఎఫ్ అండర్ 19 హ్యాండ్ బాల్ పోటీలకు తెలంగాణ జట్టు తరఫున పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు బైకాని కొమురయ్య, మేకల సంజీవ్ రావు ఉపాధ్యాయులు, విద్యార్థులు త్రిషను అభినందించారు.

