నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 19 రైతులు పశుసంపదను పరిరక్షించుకోవాలని మండల పశువైద్యాధికారి ,పవన్ కుమార్ తెలిపారు సోమవారం మండలంలోని చిన్న కొండా మరి ఏ కొత్తకోట పంచాయతీ అగ్రహారం గ్రామాలలో ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత బస్సు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా పవన్ కుమార్ ప్రసంగిస్తూ ఈనెల 19 నుంచి 31 వరకు మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ఈ వైద్య శిబిరాల్లో గొర్రెలు మేకలు దూడలకు నట్టల నివారణ మందులు చూడు నిలవని పశువులకు అవసరమైన గర్భకోశ పరీక్షలు జరిపి మందులను సూచనలు చేయడం జరుగుతుందన్నారు, 85% సబ్సిడీపై పశు బీమా పథకం ద్వారా ఆవులు గేదలు, గొర్రెలు మేకలకు బీమా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు ,ఈ అవకాశాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని కోరారు చిన్న కొండ మరి అగ్రహారం నందు జరిగిన పశువైద్య శిబిరాలలో 282 పశువులకు బూటాక్స్ స్ప్రే చేయడం జరిగిందన్నారు, జీవాలకు నటల నివారణ మందులను 400 వాటికి త్రాపించడం జరిగిందన్నారు పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు, ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గోవర్ధన్ హరిత కుమారి మౌనిక రెడ్డి ప్రసాద్ హరీష్ పాటి రైతులు పాల్గొన్నారు

