నేటిసాక్షి, నల్లగొండ : జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మరియు ఒక కార్పొరేషన్ పరిధిలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోఫొటోకి సిద్ధంగా ఉన్నామని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రావులపాటి రవి శంకర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో బీఎస్పీ జోనల్ ఇన్‌చార్జి కత్తుల కాన్షీరామ్ తో కలసి జిల్లా అధ్యక్షులు రావులపాటి రవి శంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరగనున్న స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై జిల్లాలో మొత్తం 427 వార్డుల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అనంతరం బీఎస్పీ జోనల్ ఇన్‌చార్జి కత్తుల కాన్షీరామ్ మాట్లాడుతూ, బహుజనుల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ప్రజలు ఏనుగు గుర్తును ఆశీర్వదించి బహుజనుల పాలనకు మార్గం సుగమం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా బాధ్యులు, సీనియర్ నాయకులు ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యులు వంటేపాక యాదగిరి, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ సీనియర్లు తదితరులు పాల్గొన్నారు.

