నేటి సాక్షి కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి అహ్మద్ పాషా జనవరి 20కగజ్ నగర్ ఎల్లగౌడ్ తోటలో 30 పడకల నుండి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) పనులను కేజీబీవీ పాఠశాల కగజ్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రాంగణం లో ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిటల్ మరియు జిల్లా అధికారులు. పాల్గొన్నారుఅనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ .మాట్లాడుతూ సిర్పూర్ నియోజక వర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం ఇక్కడ నివసిస్తున్న గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని ఈ ప్రజాప్రభుత్వం కగజ్ నగర్ మున్సిపాలిటీకి కోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు ఇందిరా క్రాంతిపత మహిళకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేసిందని అన్నారు సిర్పూర్ నియోజక వర్గ అభివృద్ధి కి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మున్సిపల్ కార్మికులకు గత ఐదు నెలల వేతనాలు.రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి సహకారంతో అందించామని ఆయన తెలిపారు. పట్టణాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉందని ఆయన తెలిపినారు మహిళలు ప్రత్యేకంగా పరోక్షంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ దండే విట్టల్ ఆకాంక్షించారు స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ కాగజ్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఏడాదికి 20 కోట్లు కేటాయించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రిని కోరినారుకాగజ్ నగర్ పట్టణంలో డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉందని 200 కోట్లతో వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన కోరినారు కాగజ్నగర్ పట్టణంలో పాలిటెక్నిక్ ఐటి కళాశాల మంజూరు చేయాలని కేంద్రీయ విద్యాలయానికి భూ బదలాయింపు చేయాలని ఆయన కోరారురాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎల్లవేళల ప్రజల సంక్షేమానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది ఆయన అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి సహా సహకారాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ జిల్లా అధికారులు కలెక్టర్ వెంకటేష్ దోత్రి.తాజా మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.నాయకులు పాల్గొన్నారు

