నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 20, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని కొండాపురం ఎస్టి గురుకుల పాఠశాల తరపున ఈనెల 21 22 23 వ తేదీలలో నిజామాబాద్ జిల్లాలో జరగబోవు 69వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీలకు పీఎం శ్రీ కొండాపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాల నుండి 9వ తరగతి చదువుతున్న ఉదయ్ కుమార్, ఓంకార్ మరియు సైదులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఈ ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ రాజారామ్ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు జూనియర్ వైస్ ప్రిన్సిపల్ సాంబియా నాయక్, కోచ్ డాక్టర్ రామ్మోహన్ గౌడ్, పి ఈ టి ఆంజనేయులు, తదితర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

