Tuesday, January 20, 2026

*స్వదేశీ సంకల్ప పరుగు నిర్వహణ అభినందనీయం** శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో 2కే రన్—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో మంగళవారం ఉదయం ‘స్వదేశీ సంకల్ప పరుగు – 2కే రన్’నిర్వహించారు. *స్వదేశీ వస్తు వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ స్వీతీ అనూప్ మాట్లాడుతూ, నేటి దేశ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను వినియోగించాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా సరస్వతి శిశు మందిర్ వారు స్వదేశీ సంకల్ప పరుగు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామిగా మారాలని ఆమె పిలుపునిచ్చారు.*గర్వకారణంగా స్వదేశీ సంకల్ప పరుగు*పాఠశాల ప్రబంధ కారిణి అధ్యక్షులు డాక్టర్ వేముల రవి కిరణ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎదగడంలో స్వదేశీ వస్తువుల వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వివేకానంద స్వామి జయంతి, సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ స్వదేశీ సంకల్ప పరుగు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఒడ్నాల నరేష్, ప్రబంధ కారిణి కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, కోశాధికారి నీలి శ్రీనివాస్, సమితి ఉపాధ్యక్ష కార్యదర్శులు వడ్లకొండ రాజ గంగాధర్, చెట్లపల్లి శంకర్, ప్రబంధ కారిణి సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు, పాఠశాల ప్రధానాచార్యులు గోపు వెంకటేష్, ఆచార్య బృందం, పోషకులు, విద్యార్థినీ–విద్యార్థులు కలిపి సుమారు 250 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది._______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News