నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం జగిత్యాలలో పాల్గొననున్న సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.*ఏర్పాట్లపై సమీక్ష.!*ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్‌లతో కలిసి సభా స్థలాన్ని మంత్రి పరిశీలించారు. సభా వేదిక, విద్యుత్ సరఫరా, ధ్వని వ్యవస్థతో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, నీడ సదుపాయాలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని సూచించారు.*భద్రతకు ప్రాధాన్యం*భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.*సమన్వయంతో విజయవంతం చేయాలి*ప్రభుత్వ ప్రతిష్ఠకు తగిన విధంగా సభ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. సభను సజావుగా, శాంతియుతంగా విజయవంతం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో, ఎంపిడివోతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.______

