నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 20 దేవస్థానాలు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బోయకొండ మాజీ చైర్మన్ ఎస్కె వెంకటరమణారెడ్డి అన్నారు, మండలంలోని ఏ కొత్తకోటలో అగస్తీశ్వర స్వామి ఆలయ సందర్శన అయిన తర్వాత ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ బిజెపి నాయకులు రాష్ట్రంలో దైవ చింతన పెంపొందించే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు తలపెడుతున్నారన్నారు . అందులో భాగంగానే టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు రూ 10 నుంచి 30 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు, ఏ ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలు చేపట్టలేదని గతంలో టీటీడీ ఆధ్వర్యంలో వైష్ణవ ఆలయాలకు మాత్రమే నిధులు కేటాయించే వారిని ప్రస్తుతం అన్ని ఆలయాలకు అనుమతి లభించింది అన్నారు తనకు అవకాశం వస్తే పుంగనూరు నియోజకవర్గంలోని దేవస్థానాలన్నీ ఆధునికరించి వాడవాడలా నూతన దేవస్థానాలు నిర్మిస్తే ఎలా చర్యలు తీసుకుంటానని ఆయన ఈ సందర్భంగా అన్నారు అనంతరం క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు పుంగనూరు నానా సాబ్ పేటకు చెందిన ఓం శక్తి మాలధారణ వేసుకున్న భక్తులకు ఇరుముడి సమయంలో దారి ఖర్చులకు గాను ఆయన ఆర్థిక సాయం చేశారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జల్లి మనోహర మల్లాపురం నరేష్ జనసేన నాయకుడు హరి తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

