*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026లో భాగంగా మంగళవారం ధర్మపురి రేంజ్ పరిధిలోని పెగడపల్లి మండలంలోని ల్యాగలమర్రి సెక్షన్లో వన్యప్రాణుల గణన ప్రారంభించారు.దేశ వ్యాప్తంగా నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే వన్యప్రాణుల గణన 20 తేదీ నుంచి 25 తేదీ వరకు ఉదయం అలాగే సాయంత్రం రోజు రెండు దఫాలుగా చేపట్టనున్నట్టు డిప్యూటి రేంజ్ ఆఫీసర్ గీరయ్య తెలిపారు.మొదటి మూడు రోజులు శాఖాహార జంతువులకు సంబంధించి ట్రాన్సక్టు లైన్ సర్వే, రెండు కిలోమీటర్ల పరిధిలో సమాచారం సేకరించడం, అలాగే తర్వాత మూడు రోజులు మాంసాహార జంతువులకు సంబంధించి ట్రైల్ లైన్ సర్వే, ఐదు కిలో మీటర్లు నడిచినప్పుడు వన్యప్రాణుల పాదముద్రలు, విసర్జితాలు, వెంటికలు, చెట్లపై గీసిన గీతలు, భూమిపై పొర్లాడిన అచ్చులు తదితర గుర్తులు ఎం స్ట్రైప్స్ ఎకలాజికల్ యాప్ లో నమోదు చేస్తామని డిప్యూటి రేంజ్ ఆఫీసర్ గిరయ్య పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది రాజేందర్, సత్యం పాల్గొన్నారు.

