నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ మండల పరిధిలో నీ ఎర్రవల్లి, మదనపల్లి గ్రామాల్లో మంగళవారం ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులతో ఉద్యానవన శాఖ అధికారులు, వివిధ బ్యాంకర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… ఉద్యానవన పంటలను నాణ్యతతో పండించినట్లయితే అధిక లాభాలను ఆశించ పచ్చన్నారు. ఉద్యానవన పంటలకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుందని, అలాంటి వివరాలను సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ఉద్యానవన పంటలను పండిస్తున్న రైతుల సమస్యలను తెలుసుకోవడానికి అదేవిధంగా రైతుల సూచనలను పరిగణలోకి తీసుకొని రైతులకు కావలసిన అవసరాలు తెలుసుకునేందుకు అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పూలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుతో పాటు ఆయిల్ ఫామ్ పంటలు వేసుకునేందుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. రైతులు వివిధ పంటలు వేసిన క్రమంలో అధిక దిగుబడును రావడానికి వ్యవసాయ శాస్త్రజ్ఞులచే శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. చిన్న సన్నకారు రైతులను కూడా గుర్తించి సబ్సిడీలు అందజేసి ఆర్థికంగా బలపడేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వస్తే నర్సరీల ఏర్పాటుకు సబ్సి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులు మార్కెటింగ్ చేసుకునేందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ స్థలానికి కేటాయించలేని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, మార్కెటింగ్, రైతు బజార్ సమస్యలను పరిష్కరిస్తానని రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతులకు నాణ్యమైన వంగడాలు అందించేలా అదేవిధంగా ఏ ఏ సమయాల్లో పంటలకు ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడి అధిక దిగుబడులు పొందే విధంగా ఎప్పటికప్పుడు తగు సూచనలు అందించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా కొత్త గడి, ఎర్రవల్లి, మదనపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న ఉద్యానవన పంటలను అధికారులు, రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా వికారాబాద్ లో గల పట్టుదార పరిశ్రమ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సత్తార్, ఆర్టిఏ సభ్యులు జాఫర్, సర్పంచులు సయ్యద్ రబ్బాన్, బిల్లపాటి విజయలక్ష్మి, పట్టు పరిశ్రమ ఎడి నాగరత్న, ఉద్యానవన అధికారులు కమల, డాక్టర్ సురేంద్రనాథ్, యమున తదితరులు పాల్గొన్నారు.

