నేటి సాక్షి, నారాయణపేట,జనవరి 21,(రిపోర్టర్ ఇమామ్ సాబ్) నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గల పెద్ద చెరువు కింద ఉన్న బ్రిడ్జి కాలువ ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. పంట పొలాలకు చెరువు నీళ్ళు అందకుండా అట్టి బ్రిడ్జి కాలువ లో సంవత్సరానికి ఒకసారి మట్టిని వేస్తున్నారని మరికల్ గ్రామ రైతులు చర్చించుకుంటున్నారు. ఇట్టి బ్రిడ్జి భారీ బ్రిడ్జి అని రైతులు వివరించారు. ఇట్టి కాల్వలో మట్టిని వేస్తున్నారని నారాయణపేట జిల్లా ఇరిగేషన్ అధికారులకు వివరించిన పట్టించుకోవడంలేదని మరికల్ పెద్ద చెరువు కింద ఉన్న రైతులు గ్రామంలో చర్చించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం బ్రిడ్జి కింద ఉన్న కాలువ మట్టిని వేసి మాయం చేస్తున్నారని రైతులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా నారాయణపేట జిల్లా కలెక్టర్ స్పందించి మరికల్ పెద్ద చెరువు బ్రిడ్జి కి సంబంధించిన కాల్వ లో వేసిన మట్టిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని మరికల్ గ్రామ రైతులు కోరుతున్నారు.

