నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ నియోజకవర్గం కేరమేరి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో ఈరోజు గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాల కింద చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఈ పథకాలు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా మారాయని తెలిపారు. ప్రతి అర్హుడైన లబ్ధిదారుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో BRS కేరమేరి మండల అధ్యక్షులు రాథోడ్ అంబాజీ, కేరమేరి సర్పంచ్ ఆనంద్ రావు, నిషాని సర్పంచ్ అంబారావు, మెట్ట పిప్పిరి సర్పంచ్ కొద్దు, అగర్వాడ సర్పంచ్ రోజా, ఇందాపూర్ సర్పంచ్ బుచ్చయ్య, మాజీ ఎంపీపీ మోతిరామ్, మాజీ వైస్ ఎంపీపీ కలాం, మాజీ ఎంపీటీసీ ఇప్టెకర్, యునుస్, రూపులాల్, కంబాల వినేష్, నిషార్, పెందొర్ శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

