నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ మండల పరిధిలోని గ్రామాలలో మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, వికారాబాద్ ఆర్డిఓ గారికి తాసిల్దారి గారికి మెమొరం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ… గ్రామాల్లో ఉన్న అక్కడ రైతుల పొలాలను గుట్టలను ధ్వంసం చేస్తూ ఎర్రమట్టి తవ్వకాలు చేస్తూ అడ్డు పోయిన వారిని బెదిరిస్తూ ఇబ్బందుల గురిచేస్తున్నారు. అక్కడ ఉన్న రైతులకు గ్రామస్తులకు రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఎం పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. ఎర్రమట్టి తవ్వకాలు మాఫీయను అరికట్టాలని అనేకసార్లు జిల్లా మండల అధికారులకు తెలియజేసిన కంటి తడుపు చర్యగా చేసి చేతులు దులుపుకుంటున్నారు. రాత్రి వేళలో జెసిపిలతో టిప్పర్లు లారీలలో ఎర్రమటి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. చుట్టుముట్టు గ్రామాల ప్రజలు అనేకసార్లు అధికారులకు ఫోటోలు పెట్టిన సమాచారం ఇచ్చిన సరే చూస్తాము అంటూ కలయ పనిచేస్తున్నారు తప్ప, అక్రమ మట్టి తవ్వకాలు కు అడ్డుకట్ట వెళ్లకపోతున్నారు. జిల్లా మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే యంత్రాంగాన్ని ఆయా ప్రాంతాల్లో నియమించి ఎర్రమట్టి తవ్వకాలు ఆపి నా చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకు రైతులకు రక్షణగా నిలవాలని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము లేనిచో ఆయా గ్రామాల రైతులను ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి అధికారులక్కు హెచ్చరిస్తున్నారు. ఇట్టి విషయంపై వికారాబాద్ ఆర్డీవో గారికి, తహసిల్దార్ కి సిపిఎం ఆధ్వర్యంలో మెమోరం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు డివిజన్ కార్యదర్శి సతీష్ కుమార్ నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

