నేటి సాక్షి 10 ఫిబ్రవరి పాములపాడు :– నాణ్యమైన భోజనం విద్యార్థినీలకు అందించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు కోరారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని ఉన్న కస్తూర్బా గాంధీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ సంతృప్తి చెందుతూ ఈ సందర్భంగా లింగాల నాగరాజు మాట్లాడుతూ స్కూల్ నందు దాదాపుగా 260 మంది బాలికలు చదువుతున్నారని వీరికి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని ఆయన అన్నారు.అదే మాదిరిగా వంట రూమును శుభ్రంగా ఉంచుకోవాలని వంట మనుషులు బాధ్యతగా వ్యవహరించి ఎలాంటి లోపం లేకుండా భోజనం గాని తాజా కూరగాయలతో కూరలు ఉండాలని అజాగ్రత్త చేస్తే సహించే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో సన్నబియాన్నే సరఫరా చేస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి చదువులు చదవాలని స్కూలుకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు భోజన విషయంలో ఎలాంటి లోపాలు జరిగినా జిల్లా కలెక్టర్ గారికి స్థానిక గౌరవ శాసనసభ్యులు గిత్త జయ సూర్య సారు గారికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు

