*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )బుగ్గారo మండలoలోని మద్దునూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ గాలిపెల్లి భారతి ఆధ్వర్యములో సఖి నిర్వాహకురాలు కట్కూరి లావణ్య, సిబ్బంది గ్రామపంచాయతీలో జడ్.పి.హెచ్.ఎస్ ప్రిన్సిపాల్ మధుకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్కూల్లో మరియు శ్రీ వాణి విద్యాలయం ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ గాలిపెల్లి. మహేష్ హెచ్.ఎం. అయ్యోరి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ కట్కూరి లావణ్య మాట్లాడుతూ మొదట సఖి అందించే ఐదు రకాల సేవలు, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 గురించి వివరిస్తూ బాధిత మహిళ సఖి సెంటర్ కు వస్తే తనకు సఖి సెంటర్లో తాత్కాలిక వసతి. వైద్య సహాయం. కౌన్సిలింగ్ సహాయం. పోలీస్ సహాయం. మరియు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఫ్రీగా లాయర్ ను ఇచ్చి ఏ విధంగా సహాయం చేస్తారో వివరించడం జరిగింది పైన పేర్కొన్న సేవలు అన్ని సఖి సెంటర్లో ఉచితంగా అందజేయబడతాయని తెలపడం జరిగింది. డొమెస్టిక్ వైలెన్స్ కేసుని సఖి సెంటర్ ద్వారా కోర్టులో వేసుకోవచ్చు అని వివరించడం జరిగింది. గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు,ఆడపిల్లల అక్రమ రవాణా, యాసిడ్ దాడులు గురించి మాట్లాడడం జరిగింది ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో బాలికలు మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ POCSO గురించి దాని ద్వారా అనుభవించే శిక్షల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది.బాల బాలికలు మరియు మహిళలు సొసైటీలో జరిగే అరాచకాలనుండి ఇలా తప్పించుకొని జాగ్రత్తగా ఉండాలి అని వివరించడం జరిగింది.ఈ ఈ కార్యక్రమాన్ని మద్దునూర్ గ్రామపంచాయతీలో మరియు గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి మద్దునూరు సర్పంచ్ గాలిపెల్లి. భారతి. కార్యదర్శి భాస్కర్, ఉపసర్పంచు,వార్డ్ మెంబర్లు స్కూల్ ప్రధానోపాధ్యాయులు మధుకర్ ఉపాధ్యాయులు ,గ్రామ పెద్దలు,సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ కట్కూరి లావణ్య, పారామెడికల్ డబ్బెట అనురాధ మహిళా సాధికారత సిబ్బంది స్వప్న గౌతమి పాల్గొనడం జరిగింది.

