నేటి సాక్షి, నారాయణపేట, ఫిబ్రవరి 10, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల పరిధిలో జరుగు ఎన్నికల నేపధ్యంలో ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునెల, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 5,50 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.ఎన్నికల బందోబస్తు వచ్చిన పోలీసులకు మంగళవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని SR గార్డెన్ లో, మద్దూర్, కోస్గి బందోబస్తు పోలీసులకు కోస్గి లోని పంచాక్షరి ఫంక్షన్ హాల్ లో ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులకు , సిబ్బందికి ఎన్నికల విధులపై జిల్లా ఎస్పీ దిశ నిర్ధేశం చేశారు.ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 28 రూట్లుగా డివైడ్ చేసి, రూట్ మొబైల్స్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో రిసర్వ్ టీమ్స్ , స్ట్రయికింగ్ ఫోర్స్ స్పెషల్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి మొత్తం 800 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లరాదని, 100 మీటర్ల వరకు ముగ్గుతో మార్కింగ్ వేయించి ఎవరిని లోపలికి రానివ్వరాదు అని, వాహనాల పార్కింగ్ 200 మీటర్ల దూరంలోనే వాహనాల పార్కింగ్ చేయాలని, ప్రజలు ఎవరు గుంపులు గుంపుగా ఉండకుండా చూడాలని తెలిపారు. రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద, రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు తీసుకువెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు దిగడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో 163 (144 సెక్షన్) అమలులో ఉంటుందని, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆంక్షలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన తీసుకుంటాని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అన్నారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హూల్ హాక్, సిఐలు శివ శంకర్, రవి బాబు, సైదులు, భగవత్ రెడ్డి, ఎస్ఐ లు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

