Wednesday, February 11, 2026

*జగిత్యాల జిల్లా సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక**జిల్లా అధ్యక్షుడు గా జోగ రవి ఎన్నిక**ఉపాధ్యాయ ఐక్యతకు మరో బలమైన అడుగు*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)………………………………..తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం జగిత్యాల జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జిల్లా అధ్యక్షుడిగా జోగ రవి, ప్రధాన కార్యదర్శిగా దాసరి రామస్వామి ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సాంఘిక శాస్త్ర బోధనలో నాణ్యత పెంపు లక్ష్యంగా నూతన కమిటీ ముందుకు సాగనుంది.ఇంతకాలం జిల్లా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మహేష్, ప్రధాన కార్యదర్శి మహిపాల్ సేవలను గుర్తించిన ఫోరం, వారిని రాష్ట్ర కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది.*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ*జిల్లా స్థాయిలో ఫోరాన్ని బలోపేతం చేయడంలో సహకరించిన ప్రతి ఉపాధ్యాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జోగ రవి మాట్లాడుతూ.తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన ఉపాధ్యాయ లోకానికి ధన్యవాదాలు తెలిపారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, బోధనా నైపుణ్యాల అభివృద్ధి, సబ్జెక్టు పరంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొని, నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గానికి అలాగే రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయ ఐక్యతతో ఫోరం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News