**నేటి సాక్షి* తిరుమలాయపాలెం 12 (మెట్టు రుద్రరాజు).ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా జరిగే కాలుష్యాన్ని బాల బాలికలు కు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి చైతన్య జైని వచ్చారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి శ్రీమతి చైతన్య జైని మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ కాలుష్యం పైన అవగాహన పెరగాలని అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ ప్లాస్టిక్ అనే కాలుష్యం భూతాన్ని నివారించాలని సంకల్పాన్ని విద్యార్థుల్లో కల్పించడం కోసం 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల అందరికీ తమ సొంత ఖర్చుతో 120 స్టీల్ బాటిల్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సుబ్లేడ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ రావు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

