Thursday, February 12, 2026

*మల్లాపూర్ గురుకులంలో ఘనంగా వార్షికోత్సవం**పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలి* – కాళేశ్వరం జోన్ అధికారి సిహెచ్ గిరిజ …

నేటి సాక్షి, ధర్మారం (ఫిబ్రవరి 12) : మండలంలోని మల్లాపూర్ గురుకుల పాఠశాల కళాశాలలో గురువారం ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ప్రిన్సిపల్ అరుణ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాళేశ్వరం జోన్ అధికారి సిహెచ్ గిరిజ, డి సి ఓ శ్రీనివాస్ హాజరై పాఠశాలలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, గానం, నవ్వుల క్షణాలు గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తోటి వారి సమక్షంలో భావోద్వేగాపూరితమైన వీడ్కోలు ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు జ్ఞాపకాలను గుర్తుచేస్తూ వారి భవిష్యత్తు విజయం కోసం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జోనల్ అధికారి సిహెచ్ గిరిజ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఈ ఏడు పది,ఇంటర్లో 100% గ్రేడ్ తెచ్చుకొని పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో సూచనలు చేశారు. విద్యార్థులు విద్యతో పాటు విలువలు నేర్పించిన ఉపాధ్యాయులకు ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు చదువులు మాత్రమే కాకుండా సంస్కారాన్ని కూడా అలవర్చుకొని తోటి వారికి సహాపకారిగా ఉండటానికి ప్రయత్నించాలన్నారు. ఈ ఏడు వీడ్కోలు తీసుకుంటున్న విద్యార్థులకు ఇది ముగింపు కాదు కొత్త అధ్యాయనం ప్రారంభించాలని కోరారు. మల్లాపూర్ గురుకుల పాఠశాల 2025-26 గాను పీఎం శ్రీ లో రాష్ట్రస్థాయిలో ఎంపికవడం జరిగిందని ప్రిన్సిపల్ అరుణ తెలిపారు. వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ లు అనూష, వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్ మోషన్ అలీ, పేరెంట్స్ కమిటీ మాజీ చైర్మన్ సుంచు మల్లేశం, ఉపాధ్యాయులు శ్రీలత,శ్వేత, రుసేంద్రమని, హేమ, విజయలక్ష్మి, అతియా ఫాతిమా, స్రవంతి, రజిత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News