Thursday, February 12, 2026

ఆంగ్ల భాషా దినోత్సవం

నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో సరోజినినాయుడు జన్మదినం పురస్కరించుకొని ఆంగ్ల భాష దినోత్సవాన్ని గురువారం జరుపుకున్నారు. ఈ సందర్బంగా సరోజినినాయుడు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆంగ్ల ఉపాధ్యాయులు కొండూరి రజనీకాంత్ ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముక్కాల మోహన్ రెడ్డి, వేముల మధు, కల్వకోట కార్తీక్, వేముగంటి గిరిధర్, అంతడుపుల గంగారాజం, సిద్దె గంగారాజం, రాపర్తి నర్సయ్య లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News