Thursday, February 12, 2026

*లింగాల గ్రామంలో పాదయాత్ర చేస్తున్న శివ స్వాముల భిక్ష కార్యక్రమంలో పాల్గొని, పండ్లు పంపిణీ చేసిన సమాజ సేవకుడు నవీన్ కుమార్ గౌడ్*

నేటి సాక్షి 12 ఫిబ్రవరి పాములపాడు:- పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలో శివ స్వాములు జ్యోతిర్ముడి కట్టుకొని, శివాలయం దగ్గర భిక్ష ఏర్పాటు చేసి వచ్చిన భక్తాదులకు భక్ష భోజనం వడ్డించారు. ఈ సందర్భముగా సోషల్ వర్కర్ నవీన్ కుమార్ గౌడ్ కూడా శివ స్వాములకు వచ్చిన భక్తాదులకు అరటి పండ్లు పంచడం జరిగిందన్నారు. ఈ శివ స్వాముల పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉందని నవీన్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాల శివ స్వాములు, వారి బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News