Thursday, February 12, 2026

*విజయోత్సవ ర్యాలీలకు, అనుమతి లేదు* *చెన్నూర్ సి ఐ బన్సీలాల్* మంచిర్యాల జిల్లా,, పిబ్రవరి 12

నేటి సాక్షి చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్బంగా రేపు అనగా తేదీ 13-02-2026 న చెన్నూర్ పట్టణంలో 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందని కౌంటింగ్ సెంటర్ అయిన ZPHS స్కూల్ వద్ద ప్రజలు గూమి గూడి ఉండటం, కేకలు వేయటం వంటి వి నిషేదించచనైనది. రోడ్డుపై ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించరాదని శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారి పట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొనబడుతాయని కౌంటింగ్ సెంటర్ లోకి అభ్యర్థి మరియు ఏజెంట్ కు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కౌంటింగ్ సెంటర్ లోకి సెల్ ఫోన్ అనుమతించబడదు. అదేవిదంగా పట్టణంలో విజయోత్సవ ర్యాలీ లకు గాని డీజే సౌండ్ లకు గాని టపాకాయలు పేల్చడం గాని అనుమతి లేదు. 16 వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది కావున ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంగించిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకొనబడుతాయి. పట్టణంలో 163 BNSS అమలులో ఉంటుంది కావున ఇద్దరికీ మించి గుమిగుడి ఉండటం కూడా ఎన్నికల నిబంధనలను ఊళ్ళగించినట్లే కాబట్టి ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించి శాంతి భద్రతలకు విఘతం కలిగించకూడదని చెన్నూర్ సి ఐ బన్సీలాల్ అన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News